పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత చేస్తున్న సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కి హరహర వీరమల్లు అనే టైటిల్ ని ఫిక్స్ చేసి గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన దగ్గరినుంచి ఈ సినిమా గురించే టాలీవుడ్ అంతా చర్చించుకుంటుంది. పవన్ కళ్యాణ్ ని ఈవిధంగా గతంలో ఎప్పుడు చూడలేదని అంటున్నారు అభిమానులు.. చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని చెప్పాలి. ఈ లుక్ పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతుండడంతో ఎలాంటి సందేహం లేదు.