సారంగదారియా సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రేండింగ్ గా నిలుస్తుంది. అయితే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో పాట యొక్క వివాదం కూడా అంతే పెద్ద ఇష్యూ అయ్యింది. ఈ పాట ఒరిజినల్ సృష్టికర్త కోమలి తన అనుమతి లేకుండా పాటను ఉపయోగించిన సుద్దాల అశోక్ తేజ ను, డైరెక్టర్ శేఖర్ కమ్ములపై అలిగేషన్ చేసింది.. దాంతో నాలుగు రోజులు ఈ పాట పై పెద్ద వివాదం నడిచింది. పాట హిట్ అయ్యిందన్న ఆనందం కూడా చిత్ర యూనిట్ కి లేకుండా పోయింది.. చివరికి శేఖర్ కమ్ముల తన పోస్ట్ ద్వారా అందరికి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయ్యింది..