ఇండియా లో సోనూసూద్ ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తాడు.బాలీవుడ్ నటుడు గా పలు సినిమాల్లో చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న సోను సూద్ లాక్ డౌన్ టైంలో చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు.. ప్రజలు లాక్ డౌన్ వల్ల పడే ఇబ్బందిని గమనించి ముందుకొచ్చి వారికి ఎంతో సహాయం చేశాడు సోనూ.. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న సోను మాత్రం అవేవీ లెక్క చేయకుండా ముందుకొచ్చి తన కర్తవ్యం నిర్వర్తించాడు. సినిమాల్లో చేసేది విలన్ పాత్రలే అయినా సోనూ సూద్ బయట మాత్రం రియల్ హీరో అని అయన అభిమానులు చెప్పుకున్నారు. ఎక్కడ ఉన్నా కూడా మారుమూల ప్రజల కు కష్టం వచ్చిందంటే ఆదుకునే వాడు సోనూ..