మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాతగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. రోజు రోజు కి అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.