శుభలగ్నం, మావిచిగురు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని.. చావు కబురు చల్లగా సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ ఈ సినిమా హీరో తల్లి పాత్ర లో నటిస్తుంది..90 ల్లో ఈమె చేసిన పాత్రలు.. సినిమాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. గడసరి పెళ్లాం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆమని. జగపతిబాబు కాంబినేషన్లో ఆమని చేసిన సినిమాలు చరిత్ర తిరగరాసాయి.ఇక ఆమని అనగానే శుభలగ్నం సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమా లో ఆమె చేసిన పెర్ఫార్మన్స్ ఎవరు మర్చిపోలేనిది..