యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరో కథానాయకుడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుండగా 13 అక్టోబర్ లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ ఇద్దరి హీరోల లుక్స్ ని, టీజర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు జక్కన్న. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.