సినిమాల వల్ల నిర్మాతలకు డబ్బు వచ్చిన సందర్భాలు చాల తక్కువని చెప్పాలి.. డబ్బు పోయిన సందర్భాలు, లాస్ వచ్చిన సినిమాలే వారికి ఎక్కువగా ఉంటాయి.. అయితే బ్యాక్ గ్రౌండ్ ఉండి, డబ్బు కి కొదువ లేని నిర్మాతలు అయితే దాన్ని భరించగలరు కానీ ఇతర నిర్మాతలు మాత్రం ఇది తట్టుకోలేరు. ఒక్క సినిమా మీద వచ్చే లాస్ తో సర్వం కోల్పోవాల్సి వస్తుంది.. ఇలా టాలీవుడ్ లో ఎన్నో జరిగాయి. ఒక్క సినిమా ఎఫెక్ట్ తో ఇల్లు వాకిలి అమ్ముకుని రోడ్డు మీద పడ్డ నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు.