వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట కాజల్‌కి అక్షరాలా వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 యేళ్లు అవుతున్నా. ఇప్పటికీ ఆమె తన అందంతో మాయ చేస్తోంది. తనలో అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం కూడా ఉందంటూ ఆమె చేసిన చిత్రాలు నిరూపించాయి.. తొలి చిత్రం 'లక్ష్మీకళ్యాణం' తో అందరిని ఆకట్టుకున్న కాజల్ 'చందమామ'తో హిట్ కొట్టి తనలోని టాలెంట్ నిరూపించుకుంది. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు.