టాలీవుడ్ లో అనుష్క కెరీర్ దాదాపు ముగింపుకు వచ్చేసిందని చెప్పొచ్చు.. ఒకటో రెండో సినిమాలు అవికూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి ఇప్పుడు.. సూపర్ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైన హీరోయిన్ అనుష్క.. తొలి సినిమా తోనే ఆమె స్టార్ మెటీరియ ల్ అని దర్శక నిర్మాతలకు తెలిసిపోయింది. అందుకేనేమో లేట్ చేయకుండా ఆమెకు వరుస సినిమాలు అప్పజెప్పారు.. రాజమౌళి విక్రమార్కుడు సినిమా తో ఆమెకు తిరుగులేకుండా పోయింది.. ఆ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలు రావడం మొదలయ్యాయి..