ఈమధ్య సినిమా నిర్మాతల మధ్య, డిస్ట్రిబ్యూటర్ ల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. సినిమాలు కొనడంలో పోటీ పెరగడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.. అసూయా, ఇగో లు కూడా ఈ వివాదాలకు మరో కారణం అని చెప్పొచ్చు.. ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి మరొక డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఏ రేంజ్ వివాదం నెలకొందో అందరం చూశాం.. క్రాక్ సినిమా ధియేటర్ల విషయంలో ఈ వివాదం తలెత్తగా అది దిల్ రాజు గిల్డ్ కి రాజీనామా చేసేంత వరకు వెళ్ళింది.. ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణగగా ప్రస్తుతం ఓ స్టార్ నిర్మాత ని బెదిరిస్తూ చావు కబురు చల్లగా నిర్మాత బన్నీ వాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.