ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సంఘటనలో చిక్కుకొంటే ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయట పడిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా వాస్తవికత వినోదాల మేళవింపుతో కువైట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం “సాల్ట్”. సింక్ ఫ్రేమ్ పతాకంపై అబ్దుల్ ముజీర్, ఖాజా మొయినుద్దీన్, బాబావలి షేక్, హైదర్ షేక్, మస్తాన్ యోయో ప్రధాన పాత్రలుగా మున్నా సయ్యద్ దర్శకత్వంలో వెంకట్ కోడూరు నిర్మించిన సస్పెన్స్, థ్రిల్లర్ మర్డర్, మిస్టరీ చిత్రం “సాల్ట్”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17 న అమెజాన్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా,యమ్ యక్స్ ప్లేయర్, ఓడాఫోన్ ఐడియా మొదలగు అన్ని ఓ.టి.టి ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు.