టాలీవుడ్ లో ఇప్పుడు కమెడియన్స్ కి తీవ్రమైన కొరత ఏర్పడింది. ఒకప్పుడు బ్రహ్మానందం, ఏవీఎస్, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, సునీల్, వేణుమాధవ్ ఇలా ఒకరు కాకపోతే మరొకరు పోటీ పడుతూ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని ఆప్షన్స్ లేవు.. జబర్దస్త్ నటుల రూపంలో కమెడియన్ లు చాలామందే ఉన్నా వారు ఎందుకో వెండితెరపై తేలిపోతున్నారు. బుల్లితెరపై పంచుతున్న కామెడీ ని వెండితెరపై పంచలేకపోతున్నారు.. అలాంటి టైం లో కేవలం వెండితెరపైనే అలరించే కమెడియన్ల కోసం టాలీవుడ్ గాలింపు మొదలుపెట్టగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రూపంలో మంచి కమెడియన్ ల జాడ దొరికింది..