మెగాస్టార్ అత్యుత్సాహం వల్ల కొరటాల శివ కొంప కొల్లేరవుతుంది.. వారిద్దరూ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ దర్శకుడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది..మరో కీలక పాత్ర లో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడిగా పూజ హెగ్డే ను అనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా రామ్ చరణ్ సిద్ధ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా పై అంచనాలు కూడా పెరిగిపోయాయి.. ఇక మోషన్ పోస్టర్, టీజర్ సినిమా పై భారీ అంచనాలు ఉండేలా చేయగా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.