బాహుబలి సినిమా ఎంత బాగుంటుందో రికార్డులు కూడా అంతే రేంజ్ లో ఉంటాయి.. ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం అంటే మాములు విషయం కాదు. నిజానికి టాలీవుడ్ లో ఏదైనా రికార్డు గురించి చెప్పాలంటే నాన్ బాహుబలి రికార్డు అని చెప్తారు. అంటే బాహుబలి కాకుండా ఇతర సినిమాల్లో ఎక్కువ రికార్డులు ఉన్న సినిమా రికార్డుగా ఆ రికార్డును పరిగణిస్తారు. ఇన్ డైరెక్ట్ గా బాహుబలి ని బీట్ చేయలేమని చెప్పేస్తున్నారు.. అయితే ఓ చిన్న సినిమా అది యావరేజ్ హీరో సినిమా బాహుబలి చేసిన ఓ రికార్డు ను ఛేదించింది అంటే నమ్మగలరా.. నిజంగా అదే జరిగింది.