అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.. సాయి పల్లవి కథానాయిక.. శేఖర్ కమ్ముల . ఫిదా సినిమా తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.ఇటు నాగ చైతన్య కి కూడా ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది. గత కొన్ని సినిమాలుగా నాగ చైతన్య ఏమాత్రం మెప్పించలేకపోయాడు.. ఈ సినిమా తో హిట్ కొట్టకపోతే ఇమేజ్ తగ్గే అవకాశం ఉంది.. ఇకపోతే ఈ సినిమా కు సానుకూలంశాలు ఎప్పటినుంచి మొదలయ్యాయి అంటే సారంగదారియా పాట రిలీజ్ అయినప్పటినుంచి అని చెప్పాలి.