దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ కోసం రెడీ అవుతుంది.. ఈనేపథ్యంలో ఈ సీజన్ ను ఎంతో ఆసక్తిగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మొదటి నాలుగు సీజన్ లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.. హోస్ట్ లుగా ఎన్టీఆర్, నాని, నాగార్జున లు చేసి ప్రేక్షకులను అలరించగా పార్టిసిపెంట్ అంతకుమించి ప్రేక్షకులను అలరించారు.. విజేతలుగా నిలిచినా వారు ప్రస్తుతం మంచి మంచి ఆఫర్స్ తో ముందుకు వెళుతున్నారు.