సమీరా రెడ్డి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకున్న హీరోయిన్.. ఎన్టీఆర్ నరసింహుడు సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైనా సమీరారెడ్డి ఆ తర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంది.. ఆమె కెరీర్ లో రెండో సినిమానే మెగా స్టార్ చిరంజీవి తో చేసి లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. జై చిరంజీవ లో చేసిన సమీరా రెడ్డి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు. ఇక మూడో సినిమాగా ఎన్టీఆర్ తో అశోక్ చేసింది.. అయితే ఆ సినిమా ఫ్లాప్ ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ పడింది. ఎన్టీఆర్ తో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఆమె కెరీర్ దారుణంగా డల్ అయ్యింది.