పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాతగా మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన రాగా సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ చిత్ర విశేషాలను పంచుకున్నారు..