ఏషియన్ సంస్థవారు టాలీవుడ్ హీరోలందరిని ధియేటర్ బిసినెస్ లోకి తెస్తారనుకుంటా ఇప్పటికే మహేష్ బాబు ను ఈ బిజినెస్ లోకి దించగా ఇటీవలే విజయ్ దేవరకొండ ను కూడా దించారు.. తాజగా అల్లు అర్జున్ ని కూడా ఈ బిజినెస్ లోకి దించుతున్నారు. దీంతో మన స్టార్ హీరోలు ఈ బిజినెస్ పై మనసుపడ్డారేంటి అని చెవులు కొరుక్కుంటున్నారు అభిమానులు.. ఏషియన్ మహేష్ బాబు పేరుతో ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలి లో ఓ పెద్ద మల్టీప్లెక్స్ ని మొదలుపెట్టారు. అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..