టాలీవుడ్ మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ కొంత డౌన్ ఫాల్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. ఉండడానికి చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లే ఉన్నా దేవి శ్రీ ప్రసాద్ లో మాత్రం మునుపటి ఉత్సాహం లేదు.. అప్పటి జోష్ లేదు.. తన కాంపిటీటర్ తమన్ వరుస ప్రాజెక్ట్ లతో పాటు సూపర్ హిట్ మ్యూజిక్ తో దూసుకుపోతుండగా దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఒకడుగు వెనుకే ఉంటున్నాడు.. అంతేకాదు ఇన్నాళ్లు దేవి శ్రీ తో పనిచేసిన దర్శకులు, హీరోలు సైతం థమన్ కి తరలిపోతున్నారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ కం బ్యాక్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చిందని అభిమానులు కోరుకుంటున్నారు..