RX100 సినిమా తో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన కార్తికేయ ఇటీవలే చావుకబురు చల్లగా సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.. గీత ఆర్ట్స్ నిర్మించిన సినిమా కాగా ఇది వారి బ్యానర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అని తెలుస్తుంది. తొలి చిత్రం తో ఆకట్టుకున్న కార్తికేయ ఆ తర్వాత కథ ఎంపిక లో లోపాల వల్ల హిట్ కొట్టలేకపోతున్నాడు.. ఆ సినిమా తర్వాత కార్తికేయ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. తాజగా వచ్చిన చావుకబురు కూడా అటకెక్కేసింది..