దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ సింగింగ్ షో గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ఇండియన్ ఐడల్ ప్రస్తుతం పన్నెండవ సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. గత పదకొండు సీజన్లుగా ఎంతో మంది ప్రతిభావంతులైన పాటగాళ్ళని దేశానికి అందించిన ఈ షో ప్రస్తుతం పన్నెండవ సీజన్ లో నూ అద్భుతమైన సింగర్స్ ను వెలుగులోకి తీసుకొచ్చేదుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఇక ఈ షో తెలుగు సింగర్స్ కి ప్రత్యేక స్థానం ఉంది.. ఒకరిద్దరు ఈ టైటిల్ ని గెలుచుకోగా చాలామంది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎలిమినేట్ అయ్యారు..