విద్యుల్లేఖ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బొద్దుగా.. ముద్దుగా ఉండేవారు. దీంతో ఆమె లావుపై కామెంట్స్ చేస్తూ హాస్యాన్ని పండించారు. సరైనోడు రాజుగారి గది రన్ రాజా రన్ వంటి ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్ లో కనిపించి నవ్వించారు విద్యుల్లేఖ. కోలీవుడ్ కు చెందిన ఈ నటి.. తెలుగులోనూ ఎక్కువగానే సినిమాలు చేసింది. చేస్తోంది. అయితే.. ఈ మధ్య ఈమె షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ షాక్ అయ్యారు.