పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అంతులేని, ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు ఆయన అభిమానులు.. ఆయన సినిమా వస్తుందంటే చాలు కోట్లాది మంది అభిమానులు ఒకేసారి కదలి ఆయన సినిమాను పెద్ద హిట్ ని జేస్తారు.. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ సినిమా యొక్క కలెక్షన్లే నిదర్శనం. ఏప్రిల్ 9 న  రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తుంది అంటే దాని గొప్పతనం ఆయన అభిమానులే అని చెప్పాలి.. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని బంపర్ హిట్ గా మార్చేస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. సౌత్ లో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఉన్న హీరో ఒక్క పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు..