పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోగా ఎదిగాడు.. గీత గోవిందం తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యి వరస సినిమా లతో దుమ్మురేపుతున్నడు .. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాని బాలీవుడ్ టాప్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తుండటం విశేషం.. ఛార్మి  తో కలిసి పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు..