స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా బన్నీ ఫ్యాన్స్ అయితే దీన్ని ఇప్పటికీ పండగ చేసుకునే విధంగా చూస్తున్నారు.. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమా యొక్క ఫ్రీ ల్యూడ్  ని రిలీజ్ చేశారు.. అన్న వైకుంటపురం తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన అల్లు అర్జున్ ఈ సినిమాతో తన రికార్డులను తానే బద్దలు కొట్టాలని చూస్తున్నాడు..