ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా.. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లు పూరి జగన్నాథ్ ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడో చెప్పడానికి ఆయన చేసిన మొదటి సినిమా బద్రి ఉదాహరణ కాగా ఆయన రెండో చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా అదే రేంజ్ లో హిట్ అయ్యి పూరి జగన్నాథ్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది.. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన ఎన్నో ప్రేమకథా చిత్రాలకన్నా వెరైటీగా ఉంది..