మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తేజ్ హీరో గా ప్రస్తుతం RRR సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడుగా నటిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా లో చేస్తున్నాడు.. శంకర్.. సౌత్ ఇండియా లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ దర్శకుడు గత కొన్ని రోజులుగా ప్లాప్ లను ఎదుర్కొంటూ ఎప్పుడూలేని పరాజయాల లో ఉన్నాడు.. విక్రమ్ తో చేసిన ఐ సినిమా నుండి శంకర్ కి కష్టాలు మొదలయ్యాయి చెప్పొచ్చు.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకోగా సినిమాలో ఏమంత విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు.. ఫలితంగా సినిమా శంకర్ కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది..