ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఎంత కష్టాన్ని అనుభవిస్తుందో అందరికీ తెలిసిందే.. ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి రంగం కూడా , ప్రతి ఒక్క మనిషి కూడా ఈ మహమ్మారి వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారే. ముఖ్యంగా సినిమా పరిశ్రమ అయితే ఈ సెకండ్ వేవ్ దెబ్బకు కోలుకోలేకపోవడం గ్యారెంటీ అంటున్నారు సినిమా ప్రముఖులు.. కోటాను కోట్ల ఖర్చుతో నిర్మాతలు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు.. మధ్యలో ఆపేసిన సినిమాల పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం కాకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు..