దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ టైలర్ ఈరోజు రిలీజ్ అయి మంచి స్పందన దక్కించుకుంటుంది.. మనోజ్ బాజ్ పై, ప్రియమణి ప్రధాన పాత్రలలో రెండేళ్ల క్రితం వచ్చిన ఫ్యామిలీ మాన్ సిరీస్ కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తెరకెక్కింది.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ సీరీస్ ద్వారా ఓటిటి లోకి ప్రవేశిస్తుండగ ఈ సినిమాపై టాలీవుడ్ లో సైతం భారీ అంచనాలున్నాయి.. తీవ్రవాదం, సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందించిన ఈ సీరీస్ తొలి భాగం సూపర్ సక్సెస్ కాగా రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి..