ఎన్టీఆర్ లో తెలియని మరో కోణం ఉందని తెలిసి అభిమానులు ఎంతో సంతోషపడ్డారు.. అయన పాడగలడు అని తెలిసి అభిమానులుతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి ఎన్టీఆర్ ఆలపించిన పాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం ఆరుపాటలను పాడిన ఎన్టీఆర్ మొదట యమదొంగ చిత్రంలోని ఓలమ్మి తిక్కరేగిందా పాట పాడారు.. ఆ తర్వాత కంత్రి టైటిల్ సాంగ్, అదుర్స్ లో చారీ సాంగ్, రభస లో రాకాసి రాకాసి సాంగ్, నాన్నకు ప్రేమతో లో ఫాలో యు , కన్నడ సినిమా చక్రవ్యూహ లో ఓ పాటను పాడి అభిమానులను అలరించాడు..