నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈరోజు కావడంతో అయన అభిమానులు భారీగా సందడి చేస్తున్నారు. అయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది..గత వారం రోజులుగా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే హ్యాష్ టాగ్స్ తో ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తెలపగా నేడు మాత్రం అభిమానుల ఆనందానికి అంతులేదు. ఈరోజు ఎన్టీఆర్ నటించబోయే సినిమాల అప్ డేట్స్ వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు..