టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలా మోసపోయింది, ఎలాంటి అన్యాయానికి గురైంది, అన్న అంశాలను న్యూస్ టీవీ ఛానల్లో చెబుతున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ మీడియా ముందుకు వచ్చి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు.. డ్రగ్స్ అలవాట్లు లేవు.. అని తన అభిప్రాయాన్ని తను చెప్పింది. అప్పటికే టాలీవుడ్ పరిశ్రమలో ఎంతోమంది ఆర్టిస్ట్ లు బయటికి వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని చెబుతుంటే రకుల్ ప్రీత్ ఇలా అనడం శ్రీ రెడ్డికి విపరీతమైన కోపాన్ని తీసుకువచ్చింది. దాంతో ఆమెను చెడామడా తిట్టి ఆమె చెప్పిన విషయాలను ఖండించింది.