టాలీవుడ్ లో కొంచెం టాలెంట్ ఉన్నా చాలు హీరోయిన్లను స్టార్ హీరోయిన్ చేసేదాకా వదిలిపెట్టరు మన దర్శక నిర్మాతలు. అలా కొద్ది పాటి టాలెంట్ ఎంతో అదృష్టం ఉన్న హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లు గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే మంచి టాలెంట్ ఉన్న వారు ఓ మోస్తరు హీరోయిన్ గానే రాణించి వారి కెరియర్ లకు స్వస్తి పలుకుతున్నారు. మంచి నటులు ఉండాలని కోరుకునే తెలుగు ప్రేక్షకులు ఈ తరహా నటులని మిస్ అవుతున్నారు అని చెప్పవచ్చు. అలా ప్రియమణి కి మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు దక్కాల్సిన స్టార్టమ్ దక్కలేదు అనేది ఆమె అభిమానుల వాదన.