ఎవరే అతగాడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రియమణి. తెలుగులో రెండో ఛాన్స్ కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆమె. అలా జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లయిన కొత్తలో సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని అందుకుంది. నటన, అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం ప్రియమణి వచ్చిన తొలినాళ్ళలో మంచి సినిమాలతో దూసుకు వెళ్ళింది. ఆమె కెరీర్లో యమదొంగ, నవ వసంతం, శంభో శివ శంభో, గోలీమార్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చాయి.