బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట తమిళ స్టార్ విజయ్ సేతుపతి తీసుకున్నారు కానీ డేట్స్ కుదరక పోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ పాత్రను నాగచైతన్య చేయనున్నాడు.