ఇకపోతే సన్నీ లియోన్ తెలుగులో నటించిన ఏకైక సినిమా కరెంట్ తీగ. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించడంతో పాటు ఐటమ్ సాంగ్ కూడా చేసింది. సినిమా ఫలితం ఏదైనా కూడా కమర్షియల్ గా సినిమా సక్సెస్ కావడానికి ఎంతో దోహద పడింది సన్నీలియోన్ పాత్ర. టీచర్ గా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించి పాత్రకు న్యాయం చేస్తూనే ఐటమ్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను మైమరపింప చేసింది.