తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు తనయుడు రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  హీరోకి ఉండాల్సిన హైట్ పర్సనాటిలీ రానాకి ఉన్న సక్సెస్ మాత్రం పెద్దగా కలిసి రాలేదు.  అయితే తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రానా తన సత్తా చాటుతూ వచ్చాడు.  రీసెంట్ గా తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన రానా ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుకడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.  
Image result for baahubali 2 posters
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో  బల్లాల దేవుడి రోల్‌తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  హీరో ప్రభాస్ కి సమానంగా ఈ చిత్రంలో రానాకు పేరు వచ్చింది.  బాహుబలి కి సీక్వెల్ బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ చిత్రంతో రానా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాదు మరో అదృష్టం కూడా కలిసి వచ్చింది. రానా ఓ రష్యన్ సినిమాలో నటించనున్నట్లు టాక్.   ఇందులో యోధుడిగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా, రాబోయే రోజుల్లో తాను చేయబోయే సినిమాల గురించి అందులో వివరించాడు.
Image result for baahubali 2 posters
స్టోరీ నచ్చడంతో రష్యన్ ఫిల్మ్ ఓకే చేసినట్టు చెప్పాడు.ఇది కాకుండా ఏ మూమెంటరీ లాప్స్ ఆఫ్ రీజన్ అనే హాలీవుడ్ ఫిల్మ్‌కి సైన్ చేశాడట బల్లాల దేవ. లాస్ ఏంజెల్స్లో సెటిలైన ఓ ఇండియన్ బిజినెస్మేన్గా కనిపించనున్నాడు. ఆదిత్య భట్టాచార్య డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఈ ఏడాది చివరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: