ఇంటర్నెట్లో విపరీతంగా పాప్యులారిటీ సంపాదించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌ను పలువురు ప్రముఖులు కూడా కొనియాడిన విషయం తెలిసిందే. ఆమెను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఈ అమ్మడు క్యూట్‌గా కన్ను గీటి.. నెటిజన్ల గుండెలు కొల్లగొట్టింది..అంతేనా సినీ సెలబ్రెటీల మతులు కూడా పోగొట్టింది. ఈ అమ్మడి వీడియో చూసి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు.
‘‘ఈ మధ్యకాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోను నేను అస్సలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే అది. నాకు చాలా బాగా నచ్చేసింది’’ అని ట్వీట్ చేశాడు.బన్నీ చేసిన ఈ కామెంట్స్ ప్రియా చెవిన కూడా పడ్డాయి. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మా వీడియోకు అభిమానుల నుంచి వచ్చిన ఆదరణకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ను మరిచిపోలేను.
కేరళాలో బన్నీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు’’ అంటూ మురిసిపోయింది. అభిమానుల నుంచి తనకు ఇంతటి ఆదరణ లభించినా, అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రత్యేకమైనదని, తమ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఎక్కువని చెప్పింది.సోగకళ్ల చిన్నది, త్వరలో తెలుగు తెరపై కూడా కనిపించనుంది. నిఖిల్ తర్వాతి చిత్రం కోసం నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. మరి, ఈ మలయాళ కుట్టి అల్లువారి అబ్బాయితో ఎప్పుడు నటిస్తుందో చూడాలి.