ప్రస్తుతం ‘మా’అసోసియేషన్ ఎన్నికల హడావుడి మొదలైంది.  నటుడు శివాజీరాజా పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మార్చి 10న జరగనున్నాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా వర్గం ఓవైపు, సీనియర్ నటుడు నరేష్ వర్గం మరోవైపు ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు తెరలేపారు. గత రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికల్లో పెద్ద గందరగోళం ఏర్పడ్డ విషయం తెలిసిందే.  గతంలో ‘మా’ఎన్నికలు చాలా సైలెంట్ గా పూర్తయ్యేవి..ఎలాంటి వివాదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తమ పదవీ కాలం పూర్తి చేసుకునే వారు.  కానీ గత కొంత కాలంగా ‘మా’ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు తలదన్నే విధంగా వివాదాలు అవుతున్నాయి. 

తాజాగా సీనియర్ నటుడు నరేష్, శివాజీరాజా వర్గాల మద్య ఇదే పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ..తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. నరేష్ ప్యానెల్ మీడియా ముందుకెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని శివాజీరాజా వివరణ ఇచ్చారు. నరేష్ ఎప్పుడూ 'మా'కు సహకరించలేదని స్పష్టం చేశారు. గతంలో 'మా'కు నిధులు కావాల్సి వస్తే చిరంజీవి గారితో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే రిహార్సల్స్ కు నరేష్ మొహం చాటేశాడని ఆరోపించారు శివాజీరాజా.

నరేష్ వర్గం చేసే వ్యాఖ్యలను ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉండడంతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. నా పుట్టిన రోజు నాడే నన్న దారుణంగా అవమానించారని..ఆ రోజున నన్ను కలిసేందుకు చాంబర్ వద్దకు రమ్మన్నాడు. నిజమే అని వెళితే ఎంతసేపటికీ రాలేదు. చూశావా.. శివాజీరాజాను ఎలా వెయిట్ చేయించానో అని వేరేవాళ్లతో అన్నాడట.  ఇలా ఒకరిపై ఒకరు దూషనలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  మరి ఈసారి మా అధ్యక్షుల పీఠం ఎవరిని వరించనుందో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: