మెగాస్టార్ సైరా సినిమా యూఎస్ లో స్టార్ట్ అయ్యింది.  సినిమాలోని మీకెందుకు కట్టాలిరా శిస్తు అనే డైలాగ్ అనే డైలాగ్ తో సైరా ఫైట్ సీన్ ఉందట.  నిజంగా అది అదిరిపోయినట్టు సమాచారం.  సినిమాకు మెల్లిగా పాజిటివ్ టాక్ వస్తున్నది.  సినిమా పూర్తయ్యి సినిమా టాక్ ను బట్టి కలెక్షన్లు అదిరిపోతాయి అన్నది సందేహం అవసరం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, ఇందులో బ్రిటిషర్లు తప్పా మరొకరు విలన్లుగా ఉండరు.  కానీ, ఇందులో మెగాస్టార్ ను నమ్మించి మోసం చేసే వ్యక్తిగా జగపతి బాబు కనిపించబోతున్నారు.  మెగాస్టార్ బ్రిటీషర్ల చేతికి చిక్కడానికి జగపతిబాబు ఒక కారణం అని తెలుస్తోంది.  జగపతి బాబు అలా ఎందుకు చేశాడు, వీరారెడ్డి పాత్ర ఎందుకు సైరాను బ్రిటీషర్లకు పట్టించింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఇందులో ప్రతి పాత్ర కూడా అద్భుతంగా ఉన్నట్టు సమాచారం.  


ఖైదీ నెంబర్ 150 సినిమా కమ్ బ్యాక్ మూవీగా మంచి హిట్ అయ్యింది. దాని తరువాత రెండేళ్ల గ్యాప్ తో వస్తున్న సినిమా కాబట్టి సినిమాకు మంచి హైప్ వచ్చింది.  సినిమా ఓపెనింగ్ స్లో నరేషన్ తో సాగినట్టు తెలుస్తుంది.  అయితే, ఎప్పుడైతే బ్రిటీషర్లతో తిరుగుబాటు చేయడం మొదలుపెడతాడో అప్పటి సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది.  అయితే, బ్రిటిషర్లతో పోరాటం చేసేందుకు  పాలెగాళ్ళు  ఒప్పుకోలేదట. దీంతో మెగాస్టార్ ఒక్కరే బ్రిటిషర్లపై తిరుగుతుబాటు ప్రారంభిస్తాడు.  


ఇది వీరారెడ్డికి నచ్చదు.  అందుకే వీరారెడ్డి సైరాపై కక్షతో బ్రిటీషర్ల సహాయం చేస్తారని తెలుస్తోంది. దాదాపు 270 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ విషయంలో కూడా ఎక్కడ తగ్గలేదు.  అయితే, సినిమాను బాహుబలి, సాహో రిలీజ్ చేసినన్ని థియేటర్లలో రిలీజ్ చేయకపోవడం ఒకింత ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పాలి.  మరి మూవీ పూర్తిగా ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: