సినిమాలలో తమ హీరోలను విపరీతంగ ఆరాధించే వీరభిమానులు తమ అభిమాన హీరోలను చేరుకునేందుకు ఎన్ని కష్టాలైనా పడతారు.  తమ అభిమాన హీరోలను కలిసి ఒక్క ఫొటో తీయించుకోవడం కోసం చాలారోజులు ఎదురుచూడటమే కాకుండా దానికోసం తమ సమయాన్ని మాత్రమే కాకుండా విలువైన తమ డబ్బును కూడ వృధా చేసుకుంటారు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హీరోలు కూడ తమ అభిమానులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వారికి వీలైనంత అందుబాటులో ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయంలో మెగా హీరోలు చాల ముందు వరుసలో ఉంటారు. 

మెగా కుటుంబ నేపధ్యంలో ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడ ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తూ తన అభిమాని కూతురుకు పేరు పెట్టిన ఆ సక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు సాయి తేజ్ ను కలవడానికి అతడి వీరాభిమాని గత 9 నెలలుగా విపరీతంగా ప్రయత్నం చేసాడట. దీనికి కారణం అతడికి పుట్టిన కూతురుకు సాయి తేజ్ చేత పేరు పెట్టించుకోవాలని అతడి కోరిక. ఎట్టకేలకు ఈ విషయాలు అన్నీ సాయి తేజ్ దృష్టికి రావడంతో ఆ వీరాభిమానిని తన దగ్గరకు పిలిపించుకున్నాడట ఈ మెగా మేనల్లుడు. 

అంతేకాదు తన వీరాభిమాని కోరిక మేరకు అతడి కూతురుకి పేరు పెట్టడమే కాకుండా తన పేరులోని ఒక పదం కలిసి వచ్చే విధంగా ‘తేజన్విత’ అనే పేరును సాయి ధరమ్ తేజ్ ఆ పాపకు పెట్టాడు అని తెలుస్తోంది. అంతేకాదు ఆ పాపకు చిన్న బహుమానం కూడ ఇచ్చాడట. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేసారు. దీనితో సాయి తేజ్ పేరు పెట్టిన ఆ పాప కూడ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: