సినిమా అంటే ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే అది ఏరకంగా అయినా కావొచ్చు.. అందుకో అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఆడియెన్ ను స్వర్గ లోకపు అంచులు దాకా తీసుకెళ్లేలా చేయొచ్చు. షకీలా టైంలో ఇలాంటి సినిమాలకు బీ గ్రేడ్ అన్న పేరు ఉండేది. కాని ఇప్పుడు దాని పేరు మార్చేసి అడల్ట్ కామెడీ సినిమాలని చెప్పుకుంటున్నారు.  


లేటెస్ట్ గా ఇలాంటి సినిమానే ఒకటి వచ్చింది. అదే ఏడు చేపల కథ. చిన్నప్పుడు మనకు తెలిసిన ఏడు చేపల కథ కాదు ఇది.. టెంప్ట్ రవి చేసే ఏడు చేపలతో చేసే రొమాన్సే ఈ సినిమా కథ. టీజర్, ట్రైలర్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన ఈ సినిమా గురువారం రిలీజైంది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి 600 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజైంది.


ఇక ఈ సినిమాకు యూత్ ఆడియెన్స్ కూడా ఎగబడ్డారు. బి, సి సెంటర్స్ లో చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనబడ్డాయని తెలుస్తుంది. విశాఖపట్నంలో ఓ పెద్ద థియేటర్ లో ఈ సినిమా హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు మొదటి రోజు కోటి 6 లక్షల రూపాయల కలక్షన్స్ వచ్చాయి.


ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం దానికి తగినట్టుగా కలక్షన్స్ వసూళు చేయడం గొప్ప విషయం. సినిమా నిండా బూతు ఉన్నా ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ముందుకొచ్చారు. ఈ సినిమా వారు చూసిన విధానం చూసి ఆడియెన్స్ ఎంత కరువులో ఉన్నారో అన్నట్టుగా కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక ఏరియా వైజ ఏడు చేపల కథ మొదటిరోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 38 లక్షలు
సీడెడ్ : 21 లక్షలు
ఉత్తరాంధ్ర : 13 లక్షలు
ఈస్ట్ : 8 లక్షలు
వెస్ట్ : 6.5 లక్షలు
కృష్ణా : 7.4 లక్షలు 
గుంటూరు : 7 లక్షలు
నెల్లూరు : 5 లక్షలు
ఏపి/ తెలంగాణ : 1.06 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: