మిడిల్ రేంజ్ హీరోలలో నాని ప్రత్యేక స్థానం ఉంది అతడి సినిమాలకు మినిమమ్ కలక్షన్స్ గ్యారెంటీ ఉంది. అందువల్లనే అతడి సినిమాలకు మంచి బిజినెస్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో నాని సినిమాకు పోటీగా ఏ సినిమాను విడుదల చేయడానికి ఎవరు సాహసించరు.  


ప్రస్తుతం నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ మార్చి 25న ఉగాది రోజున విడుదల కాబోతోంది. నాని నెగిటివ్ షేడ్ లో నటించిన ఈ మూవీని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చాల డిఫరెంట్ గా తీసాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీని లెక్కచేయకుండా అదే రోజు రెండు చిన్న సినిమాలు విడుదల కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 


ప్రస్తుతం ఫెయిల్యూర్ హీరోగా ముద్ర పడిన రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ అదేరోజు రిలీజ్ అవుతోంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన చిత్రమిది. లవ్ స్టోరీలను డీల్ చేయడంలో  కొండా స్పెషలిస్ట్ అన్న పేరుంది.  ఈమూవీ కూడ పరాజయం చెందితే ఇక రాజ్ తరుణ్ కెరియర్ ఇక పూర్తిగా అయిపోయినట్లే అని భావించాలి. 

 

ఇది చాలదు అన్నట్లుగా యాంకర్ ప్రదీప్ నటిస్తోన్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ కూడ ఉగాది రోజునే రాబోతోంది. దీనితో ఈ రెండు చిన్న సినిమాల సాహసం ఏమిటి అంటూ అప్పడే చర్చలు మొదలైపోయాయి. దీనికితోడు నాని సినిమాతో పోటీగా విడుదలవుతున్న ఈ సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి నాని రేంజ్ తో పోల్చుకుంటే ఈ రెండు చిన్న సినిమాలకు కనీసం ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రావు. ఇలాంటి పరిస్థితులలో కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం ఈ రెండు చిన్న సినిమాలను నాని మూవీతో పోటీగా విడుదల అంటూ చివరి దాకా పబ్లిసిటీ ఇచ్చి చివరి నిముషంలో ధియేటర్లు దొరకలేదు అని తప్పించే ఆస్కారం కనిపిస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: