ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు మన దేశంతో సహా పలు ఇతర దేశాలు అన్ని కూడా పూర్తిగా లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశాన్ని మొత్తంగా 21 రోజులపాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే దీనివలన ప్రజలు పూర్తిగా ఇళ్లకే అంకితం అవుతారని, దానివలన ప్రజల మధ్య సామజిక దూరం పెరిగి కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉంటుందని భావించాయి ప్రభుత్వాలు. అయితే దీనివలన పేద, దిగువ వర్గాల వారికి మాత్రం పూర్తిగా నష్టం చేకూరే పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే గాని డొక్కాడని వారి పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారయింది. మరికొందరు అయితే పూట గడవని స్థితిలో అల్లల్లాడిపోతుండడం గ్రహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేందుకు కొంత ఆర్ధిక ప్యాకెజీని కూడా ప్రకటించాయి. 
 
అయితే ప్రజలను ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవడం తమ బాధ్యత అంటూ ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి తమవంతుగా వీలైన సాయాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి చాలామంది ప్రముఖులు విరాళాలు అందించగా, అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ అందరికంటే ఎక్కువగా ఏకంగా రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఇకపోతే నేడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తమ సొంత సంస్థల తరపున ఈ కరోనా విపత్తు బారిన పడి బాధలు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. 
 
ముందుగా పీఎం, అలానే మహారాష్ట్ర సీఎం సహాయనిధికి తన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు తాను కలిగి ఉన్న ఫ్రాంచైజీ కోల్కటా నైట్ రైడర్స్ తరపున కొంత మొత్తాన్ని సాయంగా అందిస్తామని, కరోనా వ్యాధిగ్రస్తులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్న 50వేల మంది డాక్టర్లకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, 5500 కుటుంబాలకు ఒక నెలరోజుల పాటు మూడుపూటలా భోజనం, 10,000 మందికి నిత్యం ఒక నెలరోజుల పాటు ఉచిత భోజన కిట్లు, 2500 మంది రోజువారీ కార్మికులకు నెలకు సరిపడా సరుకులు, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో గల 100 మంది యాసిడ్ అటాక్ బాధితులకు నెలసరి స్టైఫండ్ తదితరాలు ఇవ్వడానికి సహృదయంతో ముందుకు రావడం జరిగింది. కాగా ఇంత గొప్ప చేస్తున్న షారుఖ్ పై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: