ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని స్టార్ హీరోగా దశాబ్దాల పాటు కొనసాగడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలే స్టార్ హీరోలుగా మారేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటిది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై నేటికీ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు నితిన్. జయం సినిమాతో హీరోగా పరిచయం అయిన నితిన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దిల్ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకొని తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించాడు. 

 

 

 ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సై  సినిమాతో సెన్సేషన్ సృష్టించి ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు నితిన్. ఇలా సినిమా సినిమాకి ఎంతగానో గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగారు.అందుకే నితిన్ సినిమా వస్తుందంటే అందులో  ఏదో ప్రత్యేకత ఉంటుందని తెలుగు ప్రేక్షకులు బావిస్తారు . అయితే నితిన్ ఎప్పటికప్పుడు తన సొంత టాలెంట్ ను నిరూపించుకుంటూ పైకి వచ్చిన విషయం తెలిసిందే. 

 

 దాదాపు నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతుంది. అయినప్పటికీ ఇప్పటికీ యువ హీరోలకు పోటీ ఇస్తునే ఉన్నాడు నితిన్. తనదైన టాలెంట్  నిరూపించుకుంటూ ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా మలుచుకుంటూ సినిమా ప్రేక్షకులందరికీ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అన్నాడు నితిన్. ఇక మొన్నటికి మొన్న భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. రష్మిక మందన తో జోడీ కట్టి... తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టి .. ప్రేక్షకుల పల్స్ పట్టి భారీ విజయాన్ని అందుకొని ఇప్పటికీ తనకు తిరుగు లేదు అని నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: