రాజమౌళి ఏ జానర్ లోకి వెళ్లినా కమర్షియల్ మీటర్ ను మాత్రం దాటడు. పీరియాడికల్ డ్రామా అయినా.. హిస్టారికల్ స్టోరీ అయినా ఏదైనా సరే మూవీని కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీలా డిజైన్ చేస్తాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ని కూడా ఇలాగే కలర్ ఫుల్ గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్ హాట్ లేడీతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట రాజమౌళి. 

 

నందమూరి, కొణిదెల స్టార్లు కలిసి నటిస్తోన్న ట్రిపుల్ ఆర్ కోసం టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టీటౌన్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరెక్కుతోన్న ఈ సినిమాకు భారీగా గ్లామర్ కోటింగ్ కూడా ఇస్తున్నాడు జక్కన్న. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. 

 

ట్రిపుల్ ఆర్ హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. రామ్ చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తుంటే.. తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక చరణ్ తో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ జోడీ కడుతోంది. ఇంగ్లీష్ లేడీ ఒలీవియా మోరిస్, తారక్ లవ్ ఇంట్రెస్ట్ గా ఉండనుంది. 

 

హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ ట్రిపుల్ ఆర్ లో స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ వస్తోంది. ఇక రకుల్ ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ చేయలేదు. మొదటి సారి రాజమౌళి దర్శకత్వంలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేయనుంది. మరి ఈ స్పెషల్ సాంగ్ తో కష్టాల్లో ఉన్న రకుల్ కెరీర్ లో ఏమైనా మార్పులు వస్తాయా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: