సరైన హిట్‌ లేని సురేంద్రరెడ్డి పవన్‌తో సినిమా కమిట్‌ అయ్యాడు. ఫేడౌట్‌ అయిన బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్‌తో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌' తీస్తున్నాడు. 2019 డిసెంబర్‌లో ప్రతిరోజు పండగే లాంటి హిట్‌ కొట్టిన మారుతి మాత్రం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. 10 నెలలుగా ఒక్క సినిమా కూడా ప్రకటన చేయలేదు. ఫ్లాప్‌ డైరెక్టర్సే బిజీ ఉంటే..ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మాత్రం ఎందుకు ఖాళీగా ఉన్నాడు.


మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మారుతి. చిన్న పాయింట్‌ను తీసుకొని.. సన్నివేశాలు అల్లుకుంటూ.. ఇంట్రెస్టింగ్‌ కథనంతో ఆకట్టుకోవడం మారుతి స్టైల్‌. మధ్యలో ఒకటి రెండు నిరాశపరిచినా.. సక్సెస్‌ రేటు మాత్రం బాగానే ఉంది. జనాల మధ్య తగ్గిపోతున్న బంధాలు.. అనుబంధాలు.. మానవత్వం కాన్సెప్ట్‌తో రూపొందిన 'ప్రతిరోజు పండగే' మంచి విజయం తీసుకొచ్చింది. నెక్ట్స్‌మూవీ ఏంటంటే.. ఈ ప్రశ్నకు సమాధానం మారుతీనే చెప్పలేకపోతున్నాడు.


తనకు లైఫ్‌ ఇచ్చిన అల్లు ఫ్యామిలీతో సినిమా తీయాలనేది మారుతి డ్రీమ్‌. ఆల్ రెడీ అల్లు శిరీష్‌తో కొత్త జంట తీశాడు. ప్రతిరోజు పండగే తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ తీస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే.. బన్నీ మాత్రం పుష్ప మూవీతో బిజీ అయిపోయాడు. భలేభలే మగాడివోయ్‌ తర్వాత నానితో సినిమా ప్లాన్‌ చేస్తున్నాడన్న వార్త వచ్చినా..నేచులర్‌ స్టార్‌ మాత్రం...  టక్‌ జగదీష్‌.. శ్యాం సింగ్‌రాయ్‌తో బిజీగా ఉన్నాడు. స్టార్‌ హీరోలే కాదు.. యంగ్ హీరోలందరూ ఎవరికివాళ్లు ఏడాదికి సరిపడా  ప్రాజెక్ట్స్‌తో బిజీ కావడంతో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతికి మాత్రం హీరో దొరకలేదు.


మారుతి హీరోగా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు రవితేజ. ఆల్ రెడీ కథ చెప్పాడని టాక్‌. మాస్ ‌రాజా నటిస్తున్న క్రాక్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఒకటి రెండు సినిమాలు అనుకున్నా.. ప్రకటన  చేయలేదు రవితేజ. మారుతి కథకు కమిట్ అవుతాడో... లేదో తెలియాల్సి ఉంది. లాక్‌డౌన్‌ టైంలో చాలామంది దర్శకులు కొత్త ప్రాజెక్ట్స్‌ ఎనౌన్స్‌ చేస్తుంటే.. మారుతి మాత్రం వెనుకపడిపోయాడు. మరి ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఏ హీరోతో కమిట్‌ అవుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: