స్వీటీ అనుష్క నిశ్శబ్ధం సినిమాతో నిరాశపరచింది. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వచ్చిన నిశ్శబ్ధం సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. రిలీజ్ కు ముందు ట్రైలర్ తో ఆకట్టుకున్న నిశ్శబ్ధం రిలీజ్ తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమాలో అనుష్కని తక్కువగా చూపించి మిగతా పాత్రలను హైలెట్ చేశారన్న టాక్ కూడా వచ్చింది. ఇదిలాఉంటే నిశ్శబ్ధం తర్వాత అనుష్క చేస్తున్న ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చింది.  

రారా కృష్ణయ్య సినిమా డైరక్టర్ మహేష్ డైరక్షన్ లో అనుష్క ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాతో మరోసారి అనుష్క స్టామినా ఏంటో ప్రూవ్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇదేకాకుండా అనుష్క మరో కమర్షియల్ సినిమాలో కూడా నటిస్తుందని టాక్.

స్టార్ హీరో సినిమాలో అనుష్క దాదాపు కన్ఫాం అయిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్. బొద్దుగా మారిన అనుష్క మళ్ళీ గ్లామర్ షో చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి అనుష్క అలాంటి షో చేయాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగాల్సిందే. ఓ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా.. మరో సినిమా కమర్షియల్ సినిమాగా చేస్తున్న అనుష్క ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇవే కాదు మరో సినిమాకు కూడా అనుష్కతో డిస్కషన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాలు అనుష్కని మళ్లీ ఫాం లోకి తెచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: