కమెడియన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సునీల్ ఆ క్రేజ్ తోనే హీరోగా మారాడు. అయితే హీరోగా నిలబడటంలో తడబడిన సునీల్ మళ్లీ కమెడియన్ రోల్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక లేటెస్ట్ గా సునీల్ విలన్ గా కూడా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఈ ఇయర్ మొదట్లోనే రవితేజ డిస్కో రానా సినిమాలో క్లైమాక్స్ లో విలన్ గా సర్ ప్రైజ్ చేసిన సునీల్ లేటెస్ట్ గా కలర్ ఫోటో సినిమాలో ఫిల్ లెంగ్త్ విలన్ గా అదరగొట్టాడు.

సుహాస్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో సందీప్ రాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కలర్ ఫోటో. సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమాను ఛాయ్ బిస్కెట్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ద్వారా సునీల్ విలన్ గా హిట్ అందుకున్నాడు. సినిమాలో సునీల్ రామరాజు పాత్రలో సింపుల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన ఇదివరకు కమెడియన్ ఇమేజ్ ఏమాత్రం కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.

కలర్ ఫోటోలో సునీల్ ను చూస్తే ఇక సునీల్ కూడా రెగ్యులర్ గా విలన్ పాత్రలు చేసేయొచ్చని అనిపిస్తుంది. అయితే తనకు ఉన్న కమెడియన్ ఇమేజ్ చెడగొట్టుకుని బ్యాడ్ బోయ్ ఇమేజ్ తెచ్చుకోవడం కష్టమే.. కాని సునీల్ లో విలనిజం వాడుకుంటే మాత్రం మంచి పాత్రలు చేసేలా ఉన్నాడు. కలర్ ఫోటోలో విలన్ గా సునీల్ మనకు తెలిసిన సునీల్ లా అనిపించలేదు. పాత్రకు చక్కని వేరియేషన్ చూపించాడు. మొత్తానికి సునీల్ విలన్ గా సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: